నా భూమిని కాజేయాలని కుట్ర చేస్తుండ్రు.

నా భూమిని కాజేయాలని కుట్ర చేస్తుండ్రు

అమ్మడానికి ఒత్తిడి చేయడానికి కుట్రలు.

సరిహద్దులు జరుపుతూ ఇబ్బందులకు గురి చేస్తుండ్రు.

భూ బాధితుడు ఎంటి పరశురాములు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి

మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో తన భూమిని అమ్మాలని పలుమార్లు ఒత్తిళ్లు చేస్తే అమ్మకపోవడంతో చుట్టుపక్కల ఉన్న ఇద్దరు రైతులు సరిహద్దులు ఉన్న ఒడ్లు జరుపుకుంటూ భూభాగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడంతో పాటు ఈ విధంగా అయినా అమ్మించే ప్రయత్నం చేస్తున్నారని నిజాంపేట మండలo రజకుపల్లి గ్రామానికి చెందిన రైతు పరశురాములు విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఒక ఎకరం ఏడు గంటల భూమి నిజాంపేట రెవెన్యూ శివారు పరిధిలో ఉందని తెలిపారు. అయితే తన భూమి పక్కనే ఉన్న మరో ఇద్దరు రైతులు తరచూ భూమి చదును చేసుకుంటున్నామని ఉద్దేశంతో తన భూమిలోకి పద్దు దాటి రావడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలా జరిగితే గ్రామ పెద్దలతో పాటు అధికారులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని బోరిన విలపించడం జరిగింది. అయితే తన భూమిపై కొందరు రియల్టర్లతో పాటు పక్కనే ఉన్న రైతులు కూడా కుట్ర పని తన భూమిని అందించే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టిన తాను లొంగక పోవడంతో తరచు ఓడ్లు జరుపుకుంటూ తన భూమిని ఒక ఎకరం ఏడు గంటల భూమిని విస్తీర్ణం తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరికి చెప్పిన తన సమస్య పరిష్కారం కావడం లేదని ఎవరు కూడా స్పందించడం లేదని పేద రైతు అయిన తనకు ఏమి చేయాలో అర్థం కావడం లేదని బోరున విలపించడం జరిగింది. ఒకవేళ తన భూమి విషయంలో ఇదే తరహాలో సమస్య పెరిగితే తనకు ఆత్మహత్య శరణ్యమని తన ఆశలని భూమిపైనే ఉన్నాయని రైతు పరిషరాములు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Latest Stories

*శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు* తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 15): *యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులైన కీర్తిశేషులు ముద్దసాని చందు గౌడ్ రాసాల మల్లేష్ యాదవ్ ఏర్పుల ఎల్లస్వామి యాదవ్ వట్టిపల్లి వెంకటేష్ గౌడ్ గార్ల జ్ఞాపకార్ధంగా వీరి పవిత్రమైన ఆత్మ శాంతిని చేకూరాలని మౌనం పాటించి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 128 మంది మహిళలు పోటీలో పాల్గొన్నారు ఇందులో 11 ఉత్తమ ముగ్గులకు బహుమతితోపాటు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కన్సోలేషన్ బహుమతి అందజేశారు . మొదటి పబ్బాల ఉమారాణి,ద్వితీయ బబ్బురి మమత,తృతీయ బండారి పద్మ, 4వ ఏషబోయిన అక్షర,5వ ముద్దం మానస,6వ శెట్టి మహాలక్ష్మి,7వ కోట స్వాతి,8వ శెట్టి కావ్య,9వ సుక్కల సహస్ర,10వ తోటకూరి హంసాలు,11వ ప్రబ్బాల ప్రసన్న బహమతులు గెలుపొందారు.ఈ సందర్భంగా శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు జిట్ట నరేష్ యాదవ్,గౌరవ అధ్యక్షులు శ్రీ కృష్ణ యాదవ సంఘం భువనగిరి మండల అధ్యక్షులు చుక్కల శంకర్ యాదవ్ మరియు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనకుంట్ల రేఖ బాబురావు మాట్లాడుతూ గ్రామంలో పండగల సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గ్రామంలోని మహిళలందరూ పాటిస్తూ ముగ్గుల పోటీలలో చురుకుగా పాల్గొని అద్భుతంగా ముగ్గులు వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీర్క సురేష్ రెడ్డి,నీల ఓం ప్రకాష్ గౌడ్,నాగ వినోద్,మాణిక్యం రెడ్డి,మంగు నరసింహ,కోట పెద్ద స్వామి,శ్రీ దుర్గాదేవి,బబ్బురి శంకర్ గౌడ్,శెట్టి సుమన్ యాదవ్ ,శెట్టి వంశీ యాదవ్ ,బండారు స్వామి,సుక్కల శ్రీశైలం యాదవ్ ,నోముల నరసింహ యాదవ్,నోముల శ్రీశైలం, శెట్టి శ్రవణ్ యాదవ్ ,గొట్టేటి యాదగిరి, తోటకూరి వెంకటేశ్ యాదవ్ ,మాజీ అధ్యక్షులు రసాల రాజు యాదవ్ ,వల్లాల రాజు ,మాటూరి ఉపేందర్ ,శెట్టి అశోక్ ,శెట్టి శంకర్, గొట్టేటి వెంకటేష్,గొట్టేటి తిరుపతి ,చుక్కల రామకృష్ణ, కలకుంట్ల స్వామి ,శెట్టి మహిపాల్ ,పాక లక్ష్మణ్ ,శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment