ఆరోజులే బాగుండే
తెలంగాణ కెరటం కొడిమ్యాల ప్రతినిధి డిసెంబర్
అది 1950-2000 మధ్యకాలం జన్మించిన వారు ఇప్పటి జనరేషన్ వారికి చెప్పే తీపి గుర్తులు ఆరోజులే బాగుండేది అనేది ఎస్ నిజం దురదర్శన్ లో సాయంత్రం వచ్చే వార్తలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూసేది టూరింగ్ టాకీస్ కిలోమీటర్లు నడిచి సినిమా చూసేది
కాలినడకం కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళేది బడి సెలవు రోజుల్లో కోతికొమ్మ ఆటలు గోలిలా ఆటలు తొక్కుడు బిల్ల దాగుడు మూతలు రెస్ ఆటలు దెబ్బలచెండి ఆటలు చెరువుల్లో గంటల తరబడి ఈతకొట్టుడు చెలల్లో మొక్కజొన్న అనుపకాయ కందికాయ కాల్చుకొని తినుడు ఈరోజుల్లో కనబడవు మారుతున్న కాలం లో ప్రతిఒక్కరు ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు పిల్లలు పెద్దలు ఇంటర్నెట్ గంట ఆగిపోతే ఎంత మంది మానసిక రోగులుగా మారిపోతారో తెలియడం లేదు అరచేతిలో ఫోన్ తో ప్రపంచదేశాల్లో ఎక్కడ వున్నా కళ్ళముందు కనబడుతున్నారు బంధువులు మిత్రులు మారుతున్న కాలానికి అనుగుణంగా మంచికన్నా ఎక్కువగా చెడు ఎక్కువగా అలవాట్లు బారిన పడుతున్నారు పిల్లలు వైద్యులు చెప్పేది ముఖ్యంగా పిల్లలకి ఫోన్ ఇవ్వకండి అని చెబుతున్నారు