ఆలోచింపజేసిన విద్యార్థుల ఎగ్జిబిట్లు.
సృజనాత్మకతతో
ప్రకృతికి దగ్గరగా పరిశోధనలు.
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను 5000 మంది విద్యార్థుల సందర్శన తిలకించిన డిఇఓ రమేష్ కుమార్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 12):
విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని డిఈవో రమేష్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను గురువారం నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల విద్యార్థులు దాదాపుగా 5000 మంది విద్యార్థులు గురువారం ఎగ్జిబిట్లను తిలకించారని డిఇఓ రమేష్ కుమార్ తెలిపారు. ప్రదర్శనలు వాటికి సంబంధించిన వివరాలను విద్యార్థులు, గైడ్ టీచర్లు తిలకించేందుకు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, విద్యార్థులు తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని అన్నారు. ప్రకృతి గురించి తెలుసుకోవడమే ‘సైన్స్’ అని, సమాజం గురించి తెలుసుకోవడం ‘సోషల్ సైన్స్’ అని పేర్కొన్నారు. ప్రకృతికి దగ్గరగా పరిశోధనలు జరుగాలని అభిప్రాయపడ్డారు. సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలన్నారు. అసొంలోని గౌ హతిలో జరిగిన 49వ జాతీ య బాల వైజ్ఞానిక్ ప్రదర్శన-2022 పోటీలో పాల్గొని ప్రతిభకనబర్చిన విద్యార్థులు లావుడ్యా నిహారిక, కమ్మగాని శ్రీవిద్య, రాణియా జోహా ను కలెక్టర్ శాలువా, మెమెంటో, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 16 ఆర్గనైజింగ్ కమిటీల బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.