*జర్నలిస్ట్ వేణు ను పరామర్శించిన టిజెయూ జిల్లా అధ్యక్షుడు యండి.షానూర్ బాబా*
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నల్ల.వేణు తండ్రి గారైన నల్ల బిక్షపతి ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు.విషయం తెలుసుకున్న *తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా* శనివారం వేణు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.నిరుపేద కుటుంబానికి చెందిన జర్నలిస్ట్ వేణు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న , భువనగిరి మండల అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ,జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టి కొప్పుల శ్రీనివాస్ లు ఉన్నారు.