---Advertisement---

నేడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

---Advertisement---

నేడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మరియు పర్యవేక్షకులకు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (నవంబర్ 30)

 

సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం లో కొత్తగా చేర్చబోయే వాక్సిన్ ల గురించి మరియు ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమంను మరింత సమర్థవంతంగా నిర్వహించడం మరియు పర్యవేక్షించడం గురించి ఒక్కరోజు శిక్షణ నిర్వహించడం జరిగినది*_.

_ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ సంవత్సరంలోపు చిన్నారులకు టీకాలు వేయడంతో పాటు 5,10 మరియు16 సంవత్సరాల వయసు పిల్లలకు వేయాల్సిన బూస్టర్ డోసులను కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరికి టీకా కరణ చేయాలని కోరారు_.

_జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ఈరోజు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుండి ప్రత్యేకంగా వచ్చిన డాక్టర్ మురారి యూనిసెఫ్ కన్సల్టెంట్, డాక్టర్ జోష్ణ యు ఎన్ డి పి కన్సల్టెంట్ మరియు డేవిడ్ చెప్పే విషయాలను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని క్షేత్రస్థాయిలో అమలుపరచాలని సిబ్బందిని కోరారు_.

_ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ మురారి, డా.జోష్ణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది మరియు పర్యవేక్షకులు వారి వారి పరిధిలో ఉన్న చిన్నారుల సంఖ్యను మదింపు చేసుకొని ఏ ఒక్కరూ మిస్ కాకుండా టీకాలు వేయాలని_,

_సంవత్సరం లోపు చిన్నారులకు టీకాలు వేయడమే కాకుండా 18 నెలలు, 5,10 మరియు 16 సంవత్సరాల వయసులలో వేయాల్సిన బూస్టర్ డో సులు కూడా తప్పనిసరిగా వేయాలని, అందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు_.

_టీకా కరణ అనంతరం చిన్నారులకు చిన్న చిన్న సమస్యలు ( ఎ ఇ ఎఫ్ ఐ ) ఏర్పడినట్లయితే వాటి నిర్వహణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు_.

_వ్యాక్సినేషన్ అనంతరము సిరంజి లను ఇతర వ్యర్థాలను బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాల ప్రకారం భద్రపరిచి నిర్మూలించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ లను సరియైన టెంపరేచర్లో మరియు క్రమ పద్ధతిలో నిల్వ ఉంచాలని_,

_వ్యాక్సినేషన్ అనంతరము తల్లిదండ్రులకు తరువాత డోస్ కు పిల్లలను తీసుకురావాల్సిన తేదీని తెలిపి,ఇమ్మ్యూనైషన్ కార్డులో తప్పక నమోదు చేయాలని సూచించారు_.

_ఇమ్యునైజేషన్ తీసుకోకుండా ఉన్న చిన్నారులను గుర్తించడం కోసం ఇంటింటి సర్వే చేయాలని మరియు ముఖ్యంగా గ్రామాలలో దూరంగా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న ప్రాంతాలలో_,

_ఇటుక బట్టీల ప్రాంతాలలో, కంకర క్రెషర్ ప్రాంతాలలో, సంచార జాతులు నివసించే ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఏ ఒక్క చిన్నారి మిస్ కాకుండా వ్యాక్సినేషన్ జరిగే విధంగా జాగ్రత్త వహించాలనితెలిపారు_.

_ప్రతి మహిళా ఆరోగ్య కార్యకర్త దగ్గర వారి పరిధిలో వ్యాక్సినేషన్ వేయాల్సిన చిన్నారుల సంఖ్య మరియు వివరాలు కచ్చితంగా నమోదు చేసుకుని ఉండాలని ప్రతి నెల టీకా కరణ అనంతరం వాటిని అప్డేట్ చేయాలని సూచించారు_.

_వ్యాక్సినేషన్ సెషన్ అనంతరం టీకాలు పొందిన పిల్లల వివరాలను కచ్చితంగా ఆన్లైన్ లో అప్డేట్ చేయాలని సూచించారు_.

_ప్రతి ఆరోగ్య కార్యకర్త(ఎ యన్ ఎం) వ్యాక్సినేషన్ సెషన్ సైట్ లో టీకాలకు సంబంధించిన వివరాలతో కూడిన ఐ సి ఇ ని ప్రదర్శించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు_.

_ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో వి.శ్రీనివాసులు మరియు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు_.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment