ఒంటికాలుపై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన.

ఒంటికాలుపై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 29):

 

గత 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నాగర్ కర్నూల్ సమగ్ర శిక్ష జేఏసీ అధ్యక్షుడు మురళి అన్నారు. జిల్లా అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో గత 20 రోజుల నుంచి నిరసన కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ పట్టణంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో చేపట్టారు. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె దీక్షకు కొల్లాపూర్ పట్టణానికి చెందిన వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సంఘీభావం తెలిపారు.ఆదివారం 20వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒంటి కాలుపై నిల్చొని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మురళి మాట్లాడుతూతెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కొరకు గత 20 రోజుల నుంచి సమ్మెచేపడుతున్నామని ప్రభుత్వం మా సమస్యల పరిష్కారం చూపకుండా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు.తాము విద్యాశాఖ తెలంగాణ సమగ్ర శిక్ష ఒప్పంద పద్ధతిలో అర్హతలతో ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైనట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు హోదాల్లో 21 వేలకు పైగా ఉద్యోగులను 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రతకు నోచుకోకపోవడం ఏందని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాలలో క్రమబద్ధీకరణ చేయడం జరిగిందని గుర్తు చేశారు. కనీస వేతన స్కేలు అమలు చేయడం లేదని ఉద్యోగ భద్రత, ఆరోగ్య ప్రమాద బీమా సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment