ఖమ్మం టౌన్, జనవరి 17 (తెలంగాణ కెరటం): ఈనెల 20వ తేదీన హైదరాబాద్ విమానాశ్రయం శంషాబాద్ నుండి బయలుదేరుతున్న ఉమ్రా యాత్రికులు అక్కడ ఏ విధ మైనా విధివిధానాలను అనుసరించాలనే విషయంపై 18వ తేదీ శనివారం నాడు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ముస్తఫా నగర్ ప్రాంతంలో గల మసీదు సమీపంలో గల మదర్సా తుల్ హుదా లిల్ బనాత్ లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తవాఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ హజ్ అండ్ ఉమ్రా సర్వీసెస్ నిర్వాహకులు మహమ్మద్ హాఫిజ్ జవ్వాద్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే యాత్రికులు సమయపాలన పాటించి, చెప్పిన సమయానికి శిక్షణ తరగతుల కేంద్రానికి తరలిరావాలని కోరారు.
నేడు ఉమ్రా యాత్రికులకు మదర్సా తుల్ హుదా లీల్ బానాత్ లో శిక్షణ
Published On: January 17, 2025 10:46 pm
