తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని నేషనల్ హాకర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత కటుకం గణేష్ ను సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి కాలంలో వివిధ రోగాలకు పాలవుతున్న వారికి రక్త దానం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. రక్తదాన ఉద్యమాన్ని చేపట్టి కోరుట్ల పట్టణం పేరును నలు దిశలా వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి గణేష్ అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టి, ఇంకా మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హాకర్ ఫెడరేషన్ అధ్యక్షులు షాహిద్ మొహమ్మద్ షేక్, ఉపాధ్యక్షులు అబ్దుల్ ముసవీర్, ఎండి అహ్మద్, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, జాను తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత కటుకం గణేష్ కు సన్మానం
Published On: November 29, 2024 6:49 am
---Advertisement---