కానిస్టేబుల్ కిష్టయ్యకి నివాళులు
నీల నాగరాజ్ ముదిరాజ్
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు
జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలోని కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య అని,తెలంగాణ రాష్టం కోసం ఎన్నో పోరాటాలు,ఆత్మబలిదానాలు చూసి చలించిపోయి పోలీస్ వృత్తిలో ఉండి కూడా తన కుటుంబం కంటే తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం అంటూ కామారెడ్డి లో సెల్ టవర్ ఎక్కి రివాల్వర్ కాల్చుకొని అమరుడయ్యాడని అన్నారు.మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో తొలి అమరుడు శ్రీకాంతాచారికి బదులుగా కానిస్టేబుల్ కిష్టయ్య పేరును చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.శ్రీకాంతాచారి డిసెంబర్ 3 న మరణిస్తే కిష్టయ్య డిసెంబర్ 1 నాడే ఆత్మబలిధానం చేసుకున్నాడని పేర్కొన్నారు.అలాగే కామారెడ్డి జిల్లాను కానిస్టేబుల్ కిష్టయ్య జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్ నాయక్,శ్రీధర్ శర్మ,రమేష్,రాజేందర్,మోహణాచారి,రవితేజ,ఆంజనేయులు,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.