గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ రెండు రోజుల టోకెన్ సమ్మె పిలుపు
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి డిసెంబరు 27
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎంపీడీవో కార్యాలయం ముందు 27,28 రెండు రోజుల టోకెన్ సమ్మె పిలుపు మేరకు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రోజు వెల్గటూర్ మండల లోని మండల పరిషత్ కార్యాలయం ముందు టోకెన్ సమ్మె ప్రారంభం చేయడం జరిగింది. ఈ టోకెన్ సమ్మెలోని డిమాండ్స్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలనీ, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలనీ జీ వో నెంబర్ 60 ప్రకారం కేటగిరిల వారీగా విధులు నిర్వహిస్తున్న వారికీ వేతనాలు సవరించాలని, పేర్మినెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత అనుభవాలను గుర్తించి అందరికి ప్రొమోషన్స్ కలిపించాలని ఆన్లైన్ లో పేర్లు నమోదు కానీ సిబ్బంది యొక్క పేర్లు నమోదు చేయయాలని, రెండవ పి, ఆర్, సి, పరిధిలోకి పరిగనించాలని పెండింగ్ వున్నా వేతనాలు తక్షణమే ఇవ్వాలి ఈ ఈ వేతనాలు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి సిబ్బంది బ్యాంకు ఖాతాలో ట్రెజరి ద్వారా జమ చేయాలనీ కోరుతూ టోకెన్ సమ్మెలో పాల్గొన్నారు ఈ సమ్మెలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షులు గాజుల రాజయ్య, గౌరవ అధ్యక్షులు మ్యాకల పోచయ్య, గంగయ్య, ఏ సత్తయ్య, ఎం లింగయ్య, భూమయ్య. లచ్చయ్య,అంజి, లింగయ్య,సతీష్, మలేష్, మరియి గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు