మల్లన్న సాగర్ లో చేపల వేటకు వెళ్లిన మామా అల్లుడు ఇద్దరు మృతి
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 21,
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మల్లన్న సాగర్ లో చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన మామా అల్లుడు ఇద్దరు మృతి చెందారు.మృతులు మామ అల్లుళ్లు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లె పహాడ్ గ్రామానికి చెందిన శివకుమార్(30),రాయపోల్ మండలం ఎలుకంటి గ్రామానికి చెందిన కిష్టయ్య (52) గా కుకునూరుపల్లి పోలీసులు గుర్తించారు.మృతదేహాలను గజ ఈతగాళ్ల తోటి వెలికి తీసీ,గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుల వివరాలు కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం గొడుగు శివకుమార్ తండ్రి పేరు రాజయ్య నివాసం గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లె పహాడ్,అతనికి ఒక కొడుకు నిశాంత్,ఒక కూతురు అన్య,భార్య నాగరాణి ఉన్నారు.శివకుమార్ శుక్రవారం రోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో మామ కిష్టయ్యతో కలిసి చేపల వేటకు వెళ్లారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టు కెనాల్ లో చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు అల్లుడు మామ మరణించడం జరిగింది.వారిని శనివారం రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో బట్టలు,బండి,చెప్పులు ఆనవాళ్లుగా గుర్తించి మల్లన్న సాగర్ కెనాల్ లో వెతకడం జరిగింది.కుకునూరుపల్లి పోలీసులు మృతదేహాలను గజ ఈతగాళ్ల తోటి వెలికి తీసీ,గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.