కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి.
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన.
తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 19):
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మన్ననూర్ అంబేద్కర్ చౌరస్తాలో అమీషా దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే అమిత్ షా ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలి అని వెంటనే క్షమాపణలు చెప్పాలని మన్ననూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పెర్ముల యశ్వంత్, మరియు ఎన్ ఎస్ యు ఐ కర్నూల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి యశ్వంత్, డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి . వెంకటేశ్వర్లు, రాజారాం, సిహెచ్,బాలు, రైమాన్, మేరాజ్, రౌఫ్, కె. వెంకటయ్య, బి. కృష్ణ, పర్వతాలు, పి పి. బాలస్వామి కర్ణయ, శంకర్, వంశీ, రాజు, పవన్, రంజిత్, శివ, తదితరులు పాల్గొన్నారు.