---Advertisement---

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలి.

---Advertisement---

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలి.

 

విజయ డైరీ చైర్మన్ దొడ్ల నర్సయ్య యాదవ్.

 

తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 22):

 

అచ్చంపేట మండల కేంద్రం అచ్చంపేట మండల అధ్యక్షులు దొడ్ల నర్సయ్య యాదవ్ మరియు యూత్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా ను వెంటనే బర్తరఫ్ చేయాలి అని విజయ డైరీ చైర్మన్ దొడ్ల నరసయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం అచ్చంపేట పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూకేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ గురించి హేళన చేస్తూ పదేపదే అంబేద్కర్ దేవుడుని తలిస్తే స్వర్గానికి వెళ్తారని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అన్నారు,అదే విధంగా నేడు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా అచ్చంపేట ఎంఎల్ఏ క్యాప్ ఆఫీసు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా మల్లు రవిగారు,డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డా,, వంశీ కృష్ణ ,ఎంఎల్ సి కుచకుళ్ళ దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎంఎల్ఏ కస్సిరెడ్డి నారాయణ రెడ్డి, పాల్గొంటున్నారని,కావున కాంగ్రెసు పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్,మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు అందరు ర్యాలికి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రేణయ్య, వినోద్, శక్రు, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment