అసభ్యకరంగా పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. 

అసభ్యకరంగా పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. 

 

టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ డిమాండ్. 

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో అసభ్యకరంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన తన స్వగృహంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో చాలా తప్పులు జరిగాయని ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్బిఐ అనుమతి లేకుండా విదేశాలకు డబ్బులు పంపించడం జరిగిందని ఆయన ఆరోపించారు.ఈ విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనీ ఆయన అన్నారు.అలాగే చాలా వరకు ప్రభుత్వ,దేవాలయాల భూముల విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.ధరణి పోర్టల్ ద్వారా అనేక భూదందాలు సమస్యలు పెరిగాయని వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు.ఈ పోర్టల్ ద్వారా రైతులకు భూమి ఉన్న ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా రక్షణ ఉంటుందన్నారు.బిఆర్ఎస్ నాయకులు చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా మారిందని అన్నారు. లక్షల కోట్ల అప్పు తప్ప ప్రతి ప్రభుత్వం ఏమి కూడా ఒరగబెట్టింది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె రాం చంద్రం గౌడ్.కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాకి స్వామి.నెహ్రూ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment