కేంద్ర మంత్రి అమిత్ షా ను తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. 

కేంద్ర మంత్రి అమిత్ షా ను తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. 

 

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున డిమాండ్

 

తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 18):

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ ఆవరణంలో అవమానించే విధంగా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భారతదేశవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుందని, పార్లమెంట్ కూడా భారత రాజ్యాంగం నిర్మాణం ప్రకారమే నడుస్తుందని, అలాంటి పార్లమెంటులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్నీ అవమానించడం తగదని ,తక్షణమే అమిత్ షా ను మంత్రి పదవి నుంచి తొలగించి, భారతదేశ ప్రజలకు,అందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment