భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి .

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి .

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి గరిడేపల్లి మండలం 21 .పార్లమెంట్ సమావేశాల్లో ది.

17-12-2024 వ తారీఖు కేంద్ర హోం శాఖ మంత్రి

అమిత్ షా భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వాక్యాలు వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అని గరిడేపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాకూబ్ మరియు జై భీమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ప్రపంచ దేశాలు గౌరవించదగ్గ నాయకుడు మేధావి అని, ఏ వ్యక్తి అయినా తన కోసం తన కుటుంబ కోసం మాత్రమే ఏదైనా చేస్తాడు కానీ అంబేద్కర్ తన కోసం తన పిల్లల కోసం కాకుండా దేశ ప్రజల అందరి భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన మహా మేధావి అలాంటి వ్యక్తిని కేంద్రమంత్రి అమిత్ షా తన స్వార్ధ రాజకీయాల కోసం తన సొంత రాష్ట్ర గుజరాత్ నుంచి 2010 సంవత్సరంలో రెండు సంవత్సరాలు బహిష్కరణ చేయబడిన వ్యక్తి ఏ రాజ్యాంగ నిర్మాత అయితే అందించిన రాజ్యాంగం ద్వారా మంత్రులు ప్రధాన మంత్రులు అయిన అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మాత్రమే అయ్యారని విషయం మర్చిపోకూడదు అని, తక్షణమే అమిత్ షా పార్లమెంటులో గల అంబేద్కర్ విగ్రహం పాదాలకు నమస్కారం చేసి క్షమాపణలు కోరి రాజీనామా చేయాలని వారు గరిడేపల్లి మండల కేంద్రంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జీలకర్ర రామస్వామి, సీనియర్ జర్నలిస్ట్ బరిగల విజయకుమార్, నకిరేకంటి రవి, మాజీ వార్డ్ మెంబర్ పిట్ట నరసయ్య, ఆలంపల్లి శేఖర్,అంబటి బిక్షం, పిట్ట రామకృష్ణ,సారెడ్డి సైదిరెడ్డి, మచ్చ గురేష్, పిట్ట నాగార్జున, గూడెపు లక్ష్మయ్య, బొల్లెపల్లి శ్రీనివాస్,విజయ్, పిట్ట రామంజి, పిట్ట చిట్టిబాబు, మచ్చ విష్ణు, ఆదాం, మొదలైన వారు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment