ఉపాధ్యాయ నియోజకవర్గ ఫైనల్ పట్టభద్రుల ఓటర్ జాబితా విడుదల.

ఉపాధ్యాయ నియోజకవర్గ ఫైనల్ పట్టభద్రుల ఓటర్ జాబితా విడుదల.

జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్

మెదక్ – నిజామాబాద్- అదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఫైనల్, పట్టభద్రుల ఓటరు జాబితాను 30.12.2024 తేదీన (సోమవారం) ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబితా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు,మండల విద్యాధికారి కార్యాలయాలు, జిల్లా విద్యాధికారి కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్, అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వద్ద,పట్టభద్రుల నియోజకవర్గ నియోజకవర్గ స్టేషన్ ల వద్ద వద్ద పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.జిల్లాలో నమోదైన ఉపాధ్యాయులు,అలాగే పట్టభద్రులు తమ ఓటర్ జాబితాను వివరాలను పరిశీలించి, సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
మెదక్ జిల్లాలోని ఉపాధ్యాయ ఓటర్ల వివరాలు:
పోలింగ్ స్టేషన్స్-21
1)పురుషులు: 766
2) స్త్రీలు: 515
3)ట్రాన్స్ జెండర్స్-00
………………………………
మొత్తం ఓటర్లు: 1281
………………………………..
అలాగే పట్టభద్రుల ఓటర్ జాబితా వివరాలను తెలియజేస్తూ
పోలింగ్ స్టేషన్స్-22
1)పురుషులు: 8533
2) స్త్రీలు: 3420
3)ట్రాన్స్ జెండర్స్-00
……………………………..
మొత్తం- 11953
……………………………..
ఉపాధ్యాయ, మరియు పట్టభద్రుల ఓటర్ జాబితా పూర్తి వివరాలను తెలియజేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment