ధర్మ మార్గాన్ని సూచించేందుకే వేదాలు

ధర్మ మార్గాన్ని సూచించేందుకే వేదాలు

డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి

మానవ జీవన విధానానికి, వికాసానికి అవసరమైన ధర్మ మార్గాన్ని చూపించేవే వేదాలని డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ అన్నారు. కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ‘అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం’లో భాగంగా బ్రహ్మవైవర్త పురాణ సప్తాహంలో భాగంగా ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ పాశ్చాత్య మోజులో ఆధునిక జీవనానికి అలవాటు పడిన మనందరికీ వేదవ్యాసుని పురాణాలే పుణ్య మార్గాలన్నారు. బ్రహ్మవైవర్త మహాపురాణంలోని గణపతి అవతార విశేషాలను మహేశ్వరశర్మ సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష కార్యదర్శులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజేంద్రప్రసాద్, నిర్వాహకులు రాచమడుగు శ్రీనివాసరావు, వనపర్తి చంద్రమోహన్, చలిగంటి వినోద్, బోగ శ్రీధర్, పెన్నంశెట్టి భానుమూర్తి, మంచాల రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment