జిల్లా కార్యాలయంలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమం
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 26):
భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో వీర్ బాల్ దివాస్ జిల్లా కన్వీనర్ వైజయంతి గారి అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ పాశం భాస్కర్ మాట్లాడుతూ 10 వ సిక్కు గురువు గోవింద్ సింగ్ కి నలుగురు పుత్రులు త్యాగాలను స్మరించుకోవడం వీర్ బాల్ దివస్ జరుపుకోవడం జరుగుతుంది, 1705లో ఇస్లాం మతంలోకి చేరాలని ఒత్తిడి చేస్తూ గురు గోవింద్ సింగ్ రాజ్యాన్ని ఔరంగాజేబ్ తన సైనాధిపతి వజీర్ ఖాన్ గారిని ఉసి కోల్పోవడం జరిగింది.
ఆ తరుణంలో మతమార్పిడికి అంగీకరించకపోవడంతో ఆ నలుగురిని హతమార్చడం జరిగింది. దేశం కోసం గురు గోవింద్ సింగ్ కుటుంబాన్ని మొత్తం కోల్పోవడం జరిగింది. దేశం కోసం ప్రాణాలర్పించిన గురు గోవింద్ సింగ్ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని జరుపుకుంటారు.దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీని వీర్ బాల్ దివాస్ గారి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు,
ఈ కార్యక్రమంలో నర్ల నర్సింగ్ రావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా ,జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ ,వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, లక్ష్మీనారాయణ గౌడ్ ,పట్నం కపిల్ ,బుగ్గ దేవేందర్ ,కస్తూరి మాధురి ,మాధవి, చిత్రలేఖ,రామకృష్ణ,మంగు నరసింహ, నాగ వినోద్,నరేష్, తదితరులు పాల్గొన్నారు.