శాకాహారమే మానవులకు సరియైన ఆహారం

శాకాహారమే మానవులకు సరియైన ఆహారం

 

ఘనంగా శివ సాయి పిరమిడ్ ధ్యాన మందిరం పంచమ వార్షికోత్సవం

 

అలరించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు

 

 

తెలంగాణ కెరటం ; సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19 .

శాకాహారమే మానవులకు సరైన ఆహారం అని, ధ్యానం వలన శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతోందని రాజమండ్రి పి ఎస్ ఎస్ ఎం విశిష్ట అతిథి నాదయోగి బిరుదాంకితులు గణేష్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల శివ సాయి పిరమిడ్ ధ్యాన మందిరం పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు , పిరమిడ్ శక్తి వలన శరీరంలో విద్యుత్ అయస్కాంత జీవన రసాయన చర్యలు జరిగి దేహంలోని ప్రతి కణం శుభ్రపరచడం జరుగుతుందని, అన్ని అవయవాల కణజాలం యొక్క సామర్థ్యం పెరిగి అఖండమైన మానసిక వికాసం కలుగుతుందని ,తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఆనందంగా జీవించగలమని వివరించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సంగీత నాద ధ్యానం తో పాటు అన్నమాచార్య భక్త రామదాసు కీర్తనలు ఆనందోబ్రహ్మ సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రాండ్ మాస్టర్ మన్యం హరిప్రసాద్ చే స్పిరిచ్యు వల్ రియాలిటీ షో నిర్వహించారు. శాకాహారమే అమృత ఆహారమని జంతు బలులు అన్నవి అనాగరిక మూర్ఖ ఆచారాలు మూడవిశ్వాసాలు అన్నారు. దైవత్వం నిండిన ఏ దేవతా స్వరూపం కూడా రక్తాన్ని ఇష్టపడదని , దేవతల పేరు మీద జరిగే జంతుబలులు అన్నవి అనాగరిక మూర్ఖ ఆచారాలు మూఢవిశ్వాసాలు అన్నారు. భూమిపై ఎవరిచే ఏ జీవి హింసింపబడిన వాటి మరణ వేదన మనకు శాపంగా మారుతుందని అన్నారు. వాటి కర్మలను మరో జన్మలో విధిగా అనుభవించాల్సిందేనని తెలియజేశారు. మూగజీవాలైన కోడి, మేక, చేప, రొయ్య మన ఆహారం కోసం పుట్టలేదని అవి వాటి జీవన పరిమాణం కోసమే పుట్టిన ఆత్మ స్వరూపాలని తెలుసుకొని జీవించడమే సరి అయిన మరి శాస్త్రీయమైన జీవన విధానం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ సాయి పిరమిడ్ ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు తోట నాగమణి ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు కోశాధికారి చందా విశ్వం జాయింట్ సెక్రటరీ మాను పూరి దయాసాగర్ ఉపాధ్యక్షులు కక్కిరేణి చంద్రశేఖర్ కక్కిరేణి రవిచంద్ర గౌరవాధ్యక్షులు కోటగిరి రాధాకృష్ణ సుధాకర్ పివిసి అధినేత మీలా మహదేవ్ తోట శ్యాం ప్రసాద్ పెద్దిరెడ్డి గణేష్ తోట రమేష్ సవరణ సత్యనారాయణ తోట సత్యనారాయణ కర్నాటి నాగేశ్వరరావు వెంపటి నాగరాజు సింగరకొండ శ్రవణ్ కుమార్ బొలిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment