మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన వెల్గటూర్ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్ 27.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలందర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వెల్గటూర్ తాజా మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పూదరి రమేష్ వెల్గటూర్ మాజీ ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి సప్ప లింగయ్య శ్రీనివాస్ శశి గండ్ర శ్రీకాంత్ రావు గడ్డం నరసయ్య రంగు తిరుపతి నక్క రవితేజ గుమ్ముల వెంకటేశం బందెల ఉదయ్ గౌడ్ బరుపతి జనార్ధన్ సంగేపు రాజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు