*పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన ఉపరాష్ట్రపతి ముఖ్య మంత్రివర్యుల పర్యటన*
బందోబస్త్ నిర్వహించిన మల్టీ జోన్ I ఐజి చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ రాజన్న-సిరిసిల్ల జిల్లా ఎస్పీ అకీల మహాజన్.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 25:
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి హెలికాప్టర్లో చేరుకున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,మొదట కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్క నాటిన ఉప రాష్ట్రపతి అక్కడ ఏర్పాటు చేసిన సేంద్రీయ ఎరువులకు సంబంధించన స్టాల్స్ ను పరిశీలించి ఆ తరవాత వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులతో ముచ్చటించారు.ఉప రాష్ట్రపతి ఉపన్యాసం ముగిసిన తరవాత తిరుగి బయలుదేరెను.
ఆదేవిదంగా బుధవారం మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పర్యటన పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మొదటగా మెదక్ జిల్లా ఎడపాయల వన దుర్గా అమ్మ వారిని దర్శించుకుని అక్కడ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అక్కడి నుండి ప్రపంచ ప్రసిద్ది సి.ఎస్.ఐ. చర్చ్ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసినారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఎలాంటి అవాంచినీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్త్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు బందోబస్త్ లో విదులు నిర్వహించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అబినందనలు తెలియజేశారు.