రచయిత ,జర్నలిస్టు, ప్రజల పక్షపాతి, విద్యా భూషణ్ ఆదర్శనీయుడు
రచయిత,జర్నలిస్టు, ప్రజల పక్షపాతి విద్యాభూషణ్ సంతాప సభ ఈరోజు అనగా 30 .11.2024న ఎస్వీకే లోని దొడ్డి కొమరయ్య హాల్లో జరిగింది.విప్లవ పార్టీలు, బంధుమిత్రులు కలిసి సంతాప సభ నిర్వహించారు.
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి జి ఝాన్సీ అధ్యక్షతన పాత్రికేయ సంపాదకులు టంకశాల అశోకు, సీనియర్ సంపాదకులు సతీష్ చందర్, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, జూలూరు గౌరి శంకర్, న్యూ డెమోక్రసీ సెక్రటేరియట్ సభ్యులు k గోవర్ధన్, సిపిఐ ఎంఎల్
మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హన్మేశ్, విద్యా భూషణ్ కుమారుడు ఆజాద్ ,కూతురు సంధ్య తదితరులు ప్రసంగించారు.
ముందుగా విద్యా భూషణ్ కు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం వేదికపై ఉన్న సభ్యులు విద్యా భూషణ్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.
సీనియర్ సంపాదకులు టంక శాల అశోక్ మాట్లాడుతూ జర్నలిస్టు అంటే అసాధారణమైన జర్నలిస్టు అన్నారు. ప్రజల పక్షపాతిగా వార్తలు రాసేవారన్నారు. నా సహచరుడుగా కలిసి పని చేసిన అనుభవం నాకున్నది అన్నారు.సాధారణంగా కనపడినా చాలా గొప్ప ఆలోచనలు కలిగిన వర న్నారు.
సతీష్ చందర్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన నిజాయితీతో కూడిన జర్నలిస్టు అన్నారు. ఆదిలో విప్లవ రాజకీయాలతో ప్రారంభమై వృత్తి మారినా రాజకీయాలు వదల లేదన్నారు. జీవితాంతం ఆదర్శనీయుడుగా కొనసాగాడు అన్నారు. ఎంతో మంది గతంలో ఉన్నవారు వామపక్షాలను వదిలేసి పోయినా విద్యా భూషణ్ మాత్రం అలాగే నిలబడిపోయాడన్నారు.
ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యా భూషణ్ ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతాడని అనుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల సామాజిక పత్రిక ఏర్పాటుపై పరితపించి వీక్షణం పత్రిక స్థాపనలో విద్యా భూషణ్ కూడా ఉన్నాడన్నారు.
V హనుమంతరావు నాయకత్వంలో సామాజిక, ఆర్థిక ,రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగాడు అన్నారు. 15- 20 సంవత్సరాల కాలంలో 60- 70 వ్యాసాలను వీక్షణం పత్రికకు రాయడం గర్వంగా ఉందన్నారు.
కే గోవర్ధన్, ఎం హన్మేశ్ మాట్లాడుతూ శ్రీకాకుళ ఉద్యమ ప్రస్థానంలో ప్రారంభమై కొంతకాలం వృత్తి విప్లవకారుడుగా కొనసాగాడు అన్నారు. ఉమ్మడి వివిఎస్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. హైదరాబాదులో జర్నలిస్టుగా కొనసాగిన అట్టడుగు వర్గాల శ్రేయస్సు కాంక్షించాడన్నారు సమాజంలో నడుస్తున్న వర్ధమాన, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశషయాలను, విశ్లేషణాత్మకంగా వ్యాసాలు రాసేవాడు అన్నారు. ప్రజా పంథా ,న్యూ డెమోక్రసీ, మాతృక, తిరుగుబాటు పత్రికలకు అనేక వ్యాసాలు రాసేవారు. జర్నలిస్టుగా ఉన్నా ,విప్లవ కార్యకర్తగా ఆలోచనలు చేసేవాడు అన్నారు. ఆయన నిజాయితీని, నిబద్ధతను, నిస్వార్థతను కొనియాడాలన్నారు.
కొడుకు ఆజాద్ మాట్లాడుతూ తన తండ్రికి సంబంధించిన జీవితాన్ని ఆవిష్కరించారు. తన తండ్రి తమతో స్నేహితుడిగా మెలిగేవాడు అన్నారు. తన తండ్రి చేసిన పనిలో 10- 20 శాతం చేసిన నేను ధన్యుడైనట్టేనని అన్నారు.
జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతి చేసేవాడు అన్నారు.
జి ఝాన్సీ మాట్లాడుతూ ప్రస్తుత మతోన్మాద ఫాసిస్టు పరిస్థితుల్లో తన అవసరం ఎక్కువ ఉండిందన్నారు. విద్యా భూషణ్ కు జోహార్లు తో సభ ముగిసింది.
ఈసభలో sl పద్మ, ks ప్రదీప్,అనురాధ,అరుణ,ప్రవీణ్, జర్నలిస్టు మిత్రులు,తదితరులు పాల్గొన్నారు.
హన్మేశ్
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్
9441162844
కే గోవర్ధన్
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు