జర్నలిస్ట్ దయాకర్ నీ పరామర్శించిన
– టి జేయు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా
డిసెంబర్ 21:
భువనగిరి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దాత్రాక్ దయాకర్ ఇటీవల బైక్ పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.విషయం తెలిసిన వెంటనే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎండీ షానూర్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.
ప్రమాదం జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షానూర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరంగా ప్రమాదానికి గురైనప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని, జర్నలిస్టులకు ప్రత్యేక నిధిని కేటాయించి సహయ సహకారం అందించాలని,వారి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.వారితో పాటు జర్నలిస్ట్ లు సక్రు నాయక్, సత్యం, సుజావద్దీన్, వరుణ్,సిరిల్ తదితరులు పాల్గొన్నారు.