వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన,
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 12):
నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని దేవుని తిరుమలాపురం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భగవత్ సంతోష్ సందర్శించారు.
రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని తేమశాతాన్ని పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. ప్రభుత్వం సన్న రకం వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందున రైతులు ఎవరు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని, సూచించారు. తేమ శాతం సరిగ్గా ఉన్నా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అధికారులను ఆదేశించారు. సమయానికి లారీలు వస్తున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు .దొడ్డు రకం వరి ధాన్యం సంచులపై , దొడ్డు రకం ధాన్యం గుర్తు,సెంటర్ నెంబర్ మార్కింగ్ వేయాలని, తద్వారా మిల్లు
యజమానులకు ఎలాంటి
సమస్య లేకుండా ఉంటుందని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట పెద్దకొత్తపల్లి తహసిల్దార్ జె కె మోహన్, డిప్యూటీ తహసిల్దార్ రమేష్, అధికారులు రైతులు తదితరులు ఉన్నారు.