---Advertisement---

సొంత ఖర్చుతో బోరు వేసి నీటి కష్టాలు తీర్చిన

---Advertisement---

*సొంత నిధులతో బోరు వేసి నీటి కష్టాలు తీర్చిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య*

– *పదవి ఉన్నా,లేకున్నా ప్రజలకు అండగా ఉంటానన్న నాయకుడు*

– *నీటి కష్టాలు తీర్చడంతో కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు*

అక్షర విజేత గజ్వేల్ :

మర్కూక్ మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో డబల్ బెడ్ రూమ్ కాలనీ లో గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఎలాంటి నీటి కరువు లేకుండా ఉండేదని,ప్రస్తుతం గ్రామంలో నీళ్లు చాలీచాలని నీళ్లు వస్తున్నాయి.నీళ్లు సరిపోతలేవని డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సమావేశం నిర్వహించుకొని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అయిన తుమ్మల కనకయ్యను కలసి తమ బాధను వెల్లడించి బోర్ వెయ్యాలని కోరారు.వారి సమస్యకు తుమ్మల కనకయ్య వెంటనే స్పందించి డబల్ బెడ్ రూమ్ కాలనీవాసుల కోరిక మేరకు,ఆదివారం రోజు నూతన బోరును వేయించి డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసుల కోరికను తీర్చారు.అడిగిన వెంటనే డబల్ బెడ్ రూమ్ కాలనీవాసుల నీటి కష్టాలు తీర్చిన తుమ్మల కనకయ్యకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య, మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని నీటి అవసరాలు మిషన్ భగీరథ పథకం ద్వారా ఎప్పటికప్పుడు తీర్చిందని,ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రజలను పట్టించుకోవడంలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో బచ్చల జహంగీర్, పుట్ట సత్యనారాయణ,పుట్ట కిష్టయ్య, పుట్ట దయానంద్, పుట్ట కిష్టయ్య,పందెమైన స్వామి,పర్వతలు, కిష్టయ్య, మల్లేశం, మహేందర్,ఇస్తారి, వెంకటేష్, ప్రవీణ్,భాస్కర్, శ్రీను అశోక్, ప్రభాకర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment