మేం చిన్నోలం కాదు.. కొట్లాడి తెలంగాణ తెచ్చినోల్లం:

మేం చిన్నోలం కాదు.. కొట్లాడి తెలంగాణ తెచ్చినోల్లం:

 

టీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు

 

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో

తెలంగాణ జర్నలిస్టులు అంటే చిన్నోళ్ళు కాదని.. కొట్లాడి తెలంగాణ తెచ్చినోళ్ళని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసమే పేపర్లు, ఛానల్ పెట్టి నేను తెలంగాణ వచ్చిన తర్వాత హరిగోశ పడుతున్నది తెలంగాణ తెచ్చినోళ్ళే అని అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలతో కలిసి ఉద్యమంలో పాల్గొన్న సంగతి గుర్తు చేశారు. బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, మందకృష్ణ మాదిగ, గద్దర్, విమలక్క, ప్రొఫెసర్ కోదండరాం ఇలా అందరితో కలిసి పని చేసిన సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో బహుజన బతుకమ్మ ప్రారంభించింది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అని తెలిపారు. పదేళ్ల తెలంగాణలో జర్నలిస్టులు ఎక్కువగా నష్టపోయారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5000 కిలో మీటర్ల బస్సు యాత్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జర్నలిస్టు చేసిన యాత్రగా నిలిచిపోయిందని, అందులోనే ధరణి సమస్యలు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల న్యాయం జరగాలని పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయవాదుల జంట హత్య పై పోరాడమని జర్నలిస్టు సంఘాల పేరుతో సొంత లాభం కోసం పని చేసుకునే నాయకులం కాదన్నారు. ఏ సమస్య వచ్చినా.. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ముందుండి పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో ఆంధ్ర పత్రికల పెత్తనం ఏమిటని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ పత్రికలకు సరైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు గొంతమ్మ కోరికలు కోరడం లేదని, ఇల్లు, విద్యా, వైద్యం అందిస్తే సరిపోతుందని అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర అధ్యక్షుడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షుడు పెద్దాపురం నరసింహ, రాష్ట్ర కార్యదర్శులు కనకారెడ్డి, బాపురావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, మెదక్ జిల్లా అధ్యక్షుడు పి.రామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, జర్నలిస్టులు మహేష్ గౌడ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment