---Advertisement---

ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తాం

---Advertisement---

ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తాం

 

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22 .

స్వతహాగా న్యాయవాదిని నియమించు కోవడానికి ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు న్యాయ సేవ అధికార సంస్థ తరఫున ఉచిత న్యాయ ఉచిత న్యాయ సహాయం అందిస్తామని సూర్యాపేట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ వాణి ఖైదీలకు వివరించారు. శనివారం స్థానిక సబ్ జైలును తనిఖీ చేసి ఖైదీలతో ఆమె మాట్లాడారు. క్షణికావేశం కారణంగా కేసులపాలై సమాజంలో అగౌరవపాలు కావద్దని ఆమె ఖైదీలకు హితవు చెప్పారు. జైలు జీవితం గడపడం మూలంగా జైల్లో ఉన్న వ్యక్తితో పాటుగా అతని కుటుంబం కూడా సమాజంలో చిన్న చూపుకు గురవుతుందని అది వారి యొక్క మానసిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం కలుగజేస్తుందని ఆమె వివరించారు. కక్షలు, పంతాలు, పట్టింపులు,కర్కశ స్వభావానికి దూరంగా ఉండాలని ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది న్యాయస్థానంలో రుజువు కాకపోయినప్పటికీ అతని మనస్సాక్షికి ఖచ్చితంగా తెలుస్తుంది అన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అనేకమంది ఖైదీలకు ఉచిత న్యాయ సహాయాన్ని ఇప్పటికే అందించామని భవిష్యత్తులో కూడా అదే వరవడి కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఇంకా జైలులో ఏదైనా సమస్యలు ఉంటే తనకు ప్రత్యక్షంగా లేఖ ద్వారా తెలియపరచాలని ఆమె ఖైదీలకు సూచించారు. సబ్ జైలును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె సబ్ జైలు యొక్క నిర్వహణ, పచ్చదనం పరిశుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, మంత్రి ప్రగడ సుందర రాఘవరావు, రామినేని వెంకటేష్, జిల్లా ఉచిత న్యాయ సహాయ న్యాయవాదులు సత్యనారాయణ పిళ్ళే , వెంకటరత్నం, భట్టిపల్లి ప్రవీణ్, సబ్ జైల్ సూపరింటెండెంట్ మంగ్తా నాయక్, జైల్ సిబ్బంది మంత్రిప్రగడ సీతా రామచంద్రరావు, ప్రవీణ్, రామకృష్ణ, సైదిరెడ్డి,మౌలాబి, శారద, న్యాయ సేవా అధికార సంస్థ సిబ్బంది కవిత, సుశీల, జానయ్య, పారా లీగల్ వాలంటీర్లు ఖాసీం, అమల తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment