---Advertisement---

ఇథనాల్ కంపెనీలను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తాం*

---Advertisement---

*ఇథనాల్ కంపెనీలను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తాం*

–సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి

 

తెలంగాణ కెరటం బెజ్జంకి డిసెంబర్ 10 :

 

మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయ్యపల్లి, పోతారం, నరసింహులపల్లి గ్రామాల శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున గుగ్గిళ్ళ, తిమ్మాయిపల్లి, పోతారం, నరసింహులపల్లి గ్రామాలలో జిల్లా బృందం పర్యటించి, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగింది. ఇథనాల్ కంపెనీల నిర్మాణం వల్ల పరిసర గ్రామాల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రకృతి ధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నాయని, గాలి కాలుష్యం, త్రాగే నీరు ఈ ప్రాంతంలో పంటలపై తీవ్రమైన ప్రభావం పడి ఎడారిలాగా మారే పరిస్థితిలు ఏర్పడతాయని అన్నారు. ఈ కంపెనీ నుండి వెదజల్లే కాలుష్యానికి గురయ్యే చుట్టూ 10 గ్రామాల ప్రజలు తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజల నుండి నిరసన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ వీటిని లెక్కచేయకుండా కంపెనీ పనులను యధావిధిగా యాజమాన్యం కొనసాగించడం సరైంది కాదని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే సందర్శించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని దిలావర్ పూర్ లో రద్దు చేసిన విధంగా ఇక్కడ కూడా రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని, వెంటనే చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజకీయాలకతీతంగా అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను ఈ ప్రాంత గ్రామాల ప్రజలను కలుపుకొని ఐక్యంగా పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, రాళ్ల బండి శశిధర్, సిపిఎం బెజ్జంకి మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు దాసరి ప్రశాంత్, మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ , సంఘ ఎల్లయ్య, అరవింద్, వివిధ పార్టీల నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment