పబ్లిక్ క్లబ్ ఫ్యామిలీ క్లబ్ గా మారుస్తాం

పబ్లిక్ క్లబ్ ఫ్యామిలీ క్లబ్ గా మారుస్తాం

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 01 .పబ్లిక్ క్లబ్బును ఫ్యామిలీ క్లబ్ గా మారుస్తామని పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సంవత్సర డైరీలను తయారు చేయించి సభ్యులకు అందజేస్తున్నమన్నారు. కమిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయిందని ఇప్పటివరకు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదని, నూతన విధివిధానాలతో ముందుకు వెళ్తామన్నారు. గత పాలకవర్గం నిర్వహణ లోపాలు వెలికి తీసి ఆడిట్ నిర్వహించి జనవరిలో కొత్త ప్రణాళికతో ముందుకు వెళతామన్నారు. భవిష్యత్తులో పబ్లిక్ క్లబ్ సూర్యాపేట పౌరులందరికీ ఉపయోగపడే విధంగా తయారు చేస్తామన్నారు. గతంలో స్విమ్మింగ్ పూల్ శంకుస్థాపన చేయడం జరిగిందని త్వరలో వాటిని పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ సహాయ కార్యదర్శిబోల్లె ద్దు దశరథ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్ సభ్యులు శనగాని రాంబాబు పోలేబోయిన నరసయ్య యాదవ్, నిమ్మల వెంకటేశ్వర్లు రాచకొండ శ్రీనివాస్, గవ్వ కృష్ణారెడ్డి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment