సాగు భూమి ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల రైతు భరోసా ఇస్తాం.

సాగు భూమి ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల రైతు భరోసా ఇస్తాం.

ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి  జనవరి

హైదరాబాదులో శనివారం జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో
రైతు సంక్షేమ ప్రధాన ఎజెండాగా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని,రైతు సంక్షేమ మే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు మరియు అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజల తరఫున లేక ధన్యవాదాలు తెలియజేశామని ఎమ్మెల్యే డాక్టర్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం సాగు భూమి ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని
రైతు భరోసాకి ఆమోదముద్ర
ఇందిరమ్మ ఇళ్లు,
బీసీ రిజర్వేషన్లు,
నూతన మండలాల ఏర్పాటు
రేషన్ కార్డుల జారీ,సన్న బియ్యం పంపిణీ, మొదలైన ప్రజా సంక్షేమ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ
వరంగల్ డిక్లరేషన్ లోని రైతులకు ప్రకటించిన సన్నాలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ రైతులందరికీ అందజేయడం జరిగింద ని,అర్హులైన రైతులకు రుణమాఫీ కావడం జరిగిందని రెండు లక్షల పైనున్న రైతులకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల జరగలేదు వాటిని కూడా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా అదృష్ట తీసుకువెళ్లి త్వరలో వారు కూడా కావడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వం పంట నష్టపరిహారం కూడా అచ్చంపేట నియోజకవర్గంలో రైతులకు పరిహారం నేరుగా వారి అకౌంట్లోనే జమ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, మామిళ్ళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ నరసింహారావు , కో ఆప్షన్ రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం ఉప్పునుంతల మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment