---Advertisement---

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చితే సహించం* 

---Advertisement---

*తెలంగాణ తల్లి రూపాన్ని మార్చితే సహించం*

–బీఆర్ఎస్ సోషల్ మీడియా మండలాధ్యక్షులు బండిపెల్లి సతీష్ గౌడ్

 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి నవంబర్ 30 :

 

తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని, విగ్రహాన్ని మార్పులు, చేర్పులు చేసే అధికారం ఎవరికీ లేదని, తెలంగాణ తల్లి ప్రభుత్వ వ్యవహారం కాదని, ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి సంబంధించిన అంశమని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి బండిపెల్లి సతీష్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలా మారుస్తారని, అది తెలంగాణ ఆత్మ పైన దాడి, అపచారం అవుతుందని, తెలంగాణ ఆత్మ ఉన్న ఎవరూ ఆమోదించరని, ఇప్పటికే నూతన సచివాలయ భవనం ముందు అమరజ్యోతి, అటు భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహం, వాటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించటానికి గత ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్ణయించిన స్థలంలో తెలంగాణాతో ఎలాంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి, ఇప్పుడు తెలంగాణ సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతానని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే దుశ్చర్య చేయడం మానుకొని, ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తన దుర్బుద్ధిని మార్చుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment