వాసవి క్లబ్ ద్వారా మరిన్ని సేవలందిస్తాం .

వాసవి క్లబ్ ద్వారా మరిన్ని సేవలందిస్తాం .

 

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 01 .వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని వాసవి క్లబ్ 104 ఏ నూతన గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వివిధ వాసవి క్లబ్ సంఘాల నూతన ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో వాసవి క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన వివిధ క్లబ్బులు సామాజిక సేవలు అందించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ను సమాజ సేవలో ముందు వరసలో ఉంచాలన్నారు.ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ సెక్రటరీగా బిక్కు మల్ల కృష్ణ, కోశాధికారిగా వెంపటి శబరినాథ్ తో పాటు వివిధ సంఘాల కార్యదర్శులు, కోశాధికారులు ,నూతన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి 104 ఏ మాజీ గవర్నర్ రాచర్ల కమలాకర్ ఐఈసీలు సింగరికొండ రవీందర్, తోట శ్యాం ప్రసాద్, బండారు సత్యనారాయణ, గుండా శ్రీదేవి రుద్రంగి రవి, కోటగిరి రామకృష్ణ మాజీ సెక్రటరీలు పబ్బతి వేణుమాధవ్, కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మయ్య, వాసవి క్లబ్ ఆర్సీలు జెర్సీలు, ఐపిసిలు, డిఐలు, డిపిఓ లు 2025 కు ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు, వనితలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment