సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
మెదక్ ఆర్డీవో రమాదేవి.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:
మెదక్ జిల్లా రామాయంపేట తహసిల్దార్ కార్యాలయంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి 765 డి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎలుకతుర్తి వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులతో ఆమె మాట్లాడారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.