ప్రమాదాల నివారణకు స్మార్ట్ హెల్మెట్ ధరించాలి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 12):
ద్వి చక్ర వాహనదారుల కు ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి ఇన్ స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా గురువారం తిమ్మాజీపేట హై స్కూల్ విద్యార్థులు స్మార్ట్ హెల్మెట్ రూపొందించారు.ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్( ఐ ఓ టి) సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ హెల్మెట్ ద్వి చక్ర వాహనదారుడు ఆల్కహాల్ తాగితే బైక్ స్టార్ట్ అవ్వకపోవడం,ప్రమాదం జరిగితే వెంటనే కుటుంబ సభ్యులకు జీపీఎస్ లోకేషన్ తో కూడిన మెసేజ్ వెళ్లడం,ఇంటర్నల్ బ్లూ టూత్ కనెక్టివిటీ,ఆంటీ థెఫ్ట్ అలర్ట్ వంటి అధునాతన ఫీచర్లు కలిగి ఉంది ప్రమాదాల నివారణకుఉపయోగపడుతుందని విద్యార్థులు చైతన్య,కావ్య వివరించారు.గైడ్ టీచర్ కిరణ్ కుమార్ ప్రాజెక్టు తయారీ కి ప్రోత్సాహం,సహకారం అందించారు.