సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి–
కుంభం శివకుమార్ రెడ్డి
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకులు,కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని నారాయణ పేట్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు నారాయణ పేట్ లో CVR భవన్ లో దామరగిద్ద, ధన్వాడ, మరికల్ నారాయణపేట మండలాలకు చెందిన నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఎన్నికల్లో గెలుపొందేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. అలాగే కష్టపడి పని చేసిన కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.