ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి
– వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మండలం తొగర్రాయి గ్రామ పరిధిలో శుక్రవారం రాత్రి అతి ఘోర రోడ్డు ప్రమాదం.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తొగర్రాయి గ్రామానికి చెందిన తూముల నాగేశ్వరరావు కుమారుడు తూముల గోపి వయసు 23 సంవత్సరాలు వృత్తి లారీ డ్రైవర్ అతను డ్యూటీ నిమిత్తమై డ్రైవర్ గా వెళ్ళగా జార్ఖండ్ రాష్ట్రంలో సుమారు ఐదు రోజుల క్రితం గుండెపోటుతో మరణించినాడు. అతనిని శుక్రవారం తన స్వగృమైన తొగర్రాయి గ్రామానికి తీసుకురావడం జరిగినది.ఈ విషయం తెలుసుకున్న మృతుని దగ్గర రక్తసంబందకురాలైన మోతే మండలం నరసింహపురం గ్రామానికి చెందిన సహోదరి విజయలక్ష్మి ఆమె భర్త రమేష్ తో కలిసి మృతుని కుటుంబాన్ని ఓదార్చటానికి తొగర్రాయి గ్రామం చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణంలో వారి సొంత గ్రామానికి బయలుదేరగా తొగర్రాయి గ్రామ ప్రాంతంలో గురప్ప స్వామి దేవాలయం సమీపంలో వెనకనుంచి అతివేగంగా వస్తూ ఢీ కొట్టిన లారీ అక్కడికక్కడే మహిళా మృతి, భర్తకు తీవ్ర గాయాలు అతనిని మెరుగైన వైద్యం కొరకు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.