పసుపు బోర్డు ప్రారంభించడంతో
మోర్తాడ్ లో బిజెపి సంబరాలు
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గంలో ప్రతినిధి జనవరి 15 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలకేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పసుపు బోర్డును ప్రకటించినందుకు బుధవారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది, ఈ సందర్భంగా మోర్తాడ్ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మాట్లాడుతూ బిజెపి ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ప్రకటించింది, పసుపు బోర్డు వెనకాల గత 40 సంవత్సరాల రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డు ఇ విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ రాజకీయం చేస్తూ వచ్చినప్పటికీ కేవలం ఒకే టర్ములోనే ఇచ్చిన మాటకు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఎంతో కృషి చేసి అసాధ్యం అనుకున్నటువంటి పసుపు బోర్డును సుసాధ్యం చేసి రైతుల కలలో ఆనందాన్ని నిలిపినటువంటి లీడర్ ధర్మపురి అరవింద్ , గతంలో నిజామాబాద్ సాక్షిగా అధికారికంగా ప్రకటించిన నరేంద్ర మోడీ సంక్రాంతిపండుగ కానుకగా రైతులకు పసుపు బోర్డు ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని , భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తది చేసేదే చెప్తది అనే దానికి పసుపు బోర్డు నిదర్శనం అని,అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ తెరిపించలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక విఫలమయ్యారు కాబట్టి రానున్న ఎలక్షన్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి బుద్ధి చెప్తారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ కిసాన్ మోర్చా నాయకులు ఏలేటి సాయన్న జెడి గంగారెడ్డి తీగల రమేష్ రెడ్డి బీజీ గంగారం కుంట శ్రీనివాస్ సంఘం అనిల్ కోరం ప్రకాష్ ఓల్లెం సంతోష్ గంగారెడ్డి ఆప్కా మహిపాల్ సాయికుమార్ శివానంద్ రాకేష్ సురేష్ శివ తదితరులు పాల్గొన్నారు.