ఉమామహేశ్వర దేవాలయంలో
శివ పార్వతులకు పూజలు .
తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి దంపతులు .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22 .
తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారి దంపతులు మరియు వారి సోదరుడు ఎన్ ఆర్ ఐ పటేల్ శ్రీధర్ రెడ్డి గారి దంపతులు ఉమామహేశ్వరము విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా. శ్రీ వంశీకృష్ణ , వివిధ హోదాల్లో ఉన్న అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఉమామహేశ్వర ఆలయ అర్చకులు వేదపండితులు తదితరులు.అనంతరం నల్లమల అడవులలో నెలువైన పుణ్యక్షేత్రం నందు ఉమామహేశ్వర దేవాలయంలో శివపార్వతులకు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అదేవిధంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో, జంగిల్ సఫారీ ఫారెస్ట్ ప్రాంతాన్ని సందర్శించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి .