సూర్యాపేట జిల్లా, డిసెంబర్ 16 (తెలంగాణ కెరటం) సూర్యాపేట పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో ధనుర్మాసం మార్గాలి ప్రారంభం సందర్భంగా స్వామివారికి పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ నాయుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, డిసిసి కార్యదర్శి నాగుల వాసు, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వేణుగోపాలస్వామి పూజలు
Published On: December 16, 2024 3:55 pm
---Advertisement---