యాదాద్రి భువనగిరి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై యువజన కాంగ్రెస్ నాయకుల దాడి ..
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 11):
దాడికి కొద్దిసేపటి ముందు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి , ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నిరసన వ్యక్తం చేయడానికి పార్టీ కార్యాలయానికి వెళ్లిన యువజన కాంగ్రెస్ నాయకులు అదే సమయంలో అక్కడ బిఆర్ఎస్ నాయకులు తమతో వాగ్వాదం ఘర్షణకు దిగడంతో దాడి చేసినట్లు యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దాడి చేసిన యువజన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అనంతరం భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బిఆర్ఎస్ కార్యకర్తలతో నిరసన, ధర్న చేశారు.పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన యువజన కాంగ్రెస్ నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.