తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 14,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలో గల మర్కుక్ గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు 25 సంవత్సరాలు ఎస్సీ మాల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.సురేష్ జీవనోపాధి కొరకు హైదరాబాద్ కు వెళ్లాడు.అతను హైదరాబాదు నుండి సంక్రాంతి పండగకు తన భార్యను పుట్టింటికి పంపి,స్వగ్రామానికి వచ్చాడు.సోమవారం నాడు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయాడు.ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.