గుల్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి: రాము 

గుల్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి: రాము 

 

 

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్19

 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుల్లకోట ను జగిత్యాల జిల్లా విద్యాధికారి కె రాము ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల్ని పరిశీలించి ప్రగతిని విశ్లేషించారు. ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని పలు సూచనలు అందించారు. విద్యార్థులకు చక్కగా చదివి 10 జీపీఏ సాధించాలని సూచించారు. జిల్లా విద్యాధికారి వెంట మండల విద్యాధికారి మరియు ప్రధానోపాధ్యాయులు జి. రామచంద్రం, మరియు సెక్టోరియల్ అధికారి రాజేష్, ఉపాధ్యాయులు మునీందర్ శనిగరపు రవి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రాజ్యలక్ష్మి ప్రసన్న దీపిక రమేష్ సరస్వతి జ్యోతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment