కోరుట్ల ఎస్సై శ్రీకాంత్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 01 : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం డిసెంబర్ 11 తేదిన జగిత్యాల పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను కోరుట్ల టౌన్, రూరల్ మండలంలోని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 50 కి పైగా కంపెనీలు పదవ తరగతి నుంచి ఎంటెక్ విద్యార్హత కలిగిన వారెవరికైనా కూడా ఉద్యోగాలు కల్పిస్తాయని, పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా తగిన ఉద్యోగాలు కల్పించబడతాయని తెలిపారు. ఆసక్తి గల యువతీ, యువకులు సంబంధిత బార్ కోడ్ ను గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ ఫాంను నింపి ఆన్లైన్లో అప్లై చేసుకొని 11,వ తేదీన జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు.