వివిధ పాఠశాలలో పోటీల బహుమతి పంపిణి
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి డిసెంబర్ 01
ప్రజా పాలన ప్రజా విజయవత్సవ కార్యక్రమాల్లో భాగంగా విద్యా దినోత్సవంలో భాగంగా మద్దూర్ మండల విద్యా వనరుల కేంద్రంలో మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పై నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి ఎస్ సింధుజ రెండవ బహుమతి శశాంక్ సాయి జడ్ పి హే ఎస్ మద్దూర్ మూడో బహుమతి ఎం మౌనిక జడ్ పి హే ఎస్ పల్లెర్ల తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలకిష్టప్ప మరియు మద్దూరు మండల పిఆర్టియు సంఘ అధ్యక్షులు భాస్కర్ మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు రాజు నాయక్ అనిల్ కుమార్ నర్సిములు మహామ్మద్ ఇబ్రహీం రవి శ్రీనివాస్ మరియు మద్వేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు….