---Advertisement---

వడ్ల దొంగలను పట్టుకున్న మోర్తాడ్ పోలీసులు

---Advertisement---

వడ్ల దొంగలను పట్టుకున్న మోర్తాడ్ పోలీసులు

కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన

మోర్తాడ్ ఎస్సై బి .విక్రమ్

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 1 :

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రం నుండి ధోన్ పాల్ గ్రామానికి వెళ్లే గ్రౌండ్ వద్ద, ఖాళీ స్థలంలో రైతులు,పండించిన వరి ధాన్యాన్ని ఆరబెట్టి, వరి ధాన్యం ఆరిన తర్వాత, సంచులలో నింపి, కొనుగోలు కేంద్రానికి తరలించేందుకు, వరి ధాన్యం సంచులను, ఖాళీ స్థలం గల గ్రౌండ్ లోనే రైతులు అక్కడేఉంచారు. గత ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు,ఖాళీ స్థలంలో ఉన్న వరి ధాన్యం సంచులను, మరియు ఏర్గట్ల మండలంలో, కమ్మర్ పల్లి మండలంలో, ఏర్గట్ల మండలంలో సైతం గుర్తు తెలియని వ్యక్తులు, రైతుల వరి ధాన్యం సంచులను గత ఐదు రోజుల క్రితం దొంగిలించుకు వెళ్లిపోయారు. శనివారం రాత్రి మోర్తాడ్ మండల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సౌకత్ అలీ, ప్రసన్నకుమార్, తిరుపతి అనే పోలీసులు అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగాసంచరిస్తుండడం,పోలీసుల కంటపడడంతో, అనుమానం తో వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు అని మోర్తాడ్ మండల ఎస్సై బి. విక్రం తెలిపారు. ఆ ముగ్గురు వ్యక్తులను విచారించగా,వరి ధాన్యం సంచులను దొంగిలించినట్లు ఒప్పుకున్నారని బి. విక్రమ్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వెళ్లి, దొంగతనంకు పాల్పడ్డ వరిధాన్యం సంచులను,వరి ధాన్యాన్ని నింపినప్రాంతానికి వెళ్లి,దొంగతనం గురైన వరి ధాన్యం సంచులను రికవరీ చేసినట్లుమోర్తాడ్ ఎస్సై తెలిపారు. వరి ధాన్యం సంచులను దొంగతనానికి పాల్పడ్డవ్యక్తులైన బోదాస్ మహేందర్,బత్తుల సుమన్, ఆలకుంట శ్రావణ్ లను పట్టుకొని, వడ్ల సంచులను రికవరీ చేసి,దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులపై బాల్కొండ, కమ్మర్ పల్లి ,ఏర్గట్ల, మోర్తాడ్ తోపాటు పలు స్టేషన్లలో వారిపై కేసులు నమోదు చేసి, రిమాండ్ కు పంపినట్లుమోర్తాడ్ మండల ఎస్సై, బి.విక్రమ్ తెలిపారు.వరి సంచుల దొంగతనానికి పాల్పడ్డ వారిని పట్టుకున్న ఈ విషయం తెలుసుకున్న భీంగల్ సీఐ వినయ్ కుమార్, మోర్తాడ్ మండల ఎస్సై విక్రం, దొంగలను పట్టుకున్నపోలీసులను అభినందించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment