మాలల సింహగర్జన సభకు బయలుదేరిన ఉద్యోగులు.
జెండా ఊపి సింహగర్జన సభ బస్సును ప్రారంభిస్తున్న మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూన గోవర్ధన్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 1):
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన మాలల సింహ గర్జన సభకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోన గోవర్ధన్ జెండా ఊపి హలో మాల చలో హైదరాబాద్* బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సభ జిల్లా కన్వీనర్ లెక్చరర్ కందూరి కృష్ణయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సామా రమేష్, కోశాధికారి ప్రభాకర్, సభ్యులు కురుమయ్య, చెన్నయ్య, బాలరాజు, శేషగిరి, శేఖర్, డాక్టర్ శంకరయ్య, సంకిరాజు, టి నాగయ్య, రామకృష్ణ శివకుమార్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.