---Advertisement---

జిల్లాలో వడ్డీ దందా నగదుకు హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాల్సిందే…

---Advertisement---

జిల్లాలో కొత్త రూపం దాల్చింది వడ్డీ దందా.ఫైనాన్స్ ద్వారా రుణాలు తీసుకోవడానికి పట్టణాలు,

మండల కేంద్రాల్లోని వ్యాపారుల వద్దకు వెళ్లేవారు. ప్రస్తుతం వడ్డీ వ్యాపారులు నేరుగా గ్రామాలకు వచ్చి రుణాలు అందజేస్తున్నారు.

ఎదుటివారి ఆర్థిక అవసరాలను, కష్టాలను ఆసరాగా చేసుకుని కొందరు వడ్డీ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేయడం, ఖాళీ చెక్కులు, ఏటిఏం కార్డులు, బంగారు ఆభరణాలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఇళ్లు, ఖాళీస్థలాలు, వాహనాలు కుదవ పెట్టుకుని ఇచ్చే దళారులే అత్యధికంగా ఉన్నారు.

సాధారణంగా గ్రామాల్లో నూటికి రూ.2 ల చొప్పున వడ్డీకి అప్పులిచ్చే వారు. కానీ, ఎప్పుడైతే రిజిష్టర్ ఫైనాన్స్ లు వడ్డీ వ్యాపారం లోకి వచ్చాయో అప్పటి నుంచి వడ్డీ వ్యాపారులకు ఇది ఓ వరంగా మారింది. ఈ మధ్యకాలంలో మనుషుల ఆలోచనల్లో వచ్చిన మార్పు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సైతం వడ్డీకి డబ్బులు బాకీ ఇచ్చేందుకు చాలామంది వెనకాడుతున్నారు.
అధిక వడ్డీ వ్యాపారం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. రూ.10 నుంచి రూ.30 వడ్డీ వసూలు చేస్తూ కొందరు వ్యాపారులు జిల్లాలో వడ్డీ దందా చేస్తున్నారు. నగదు అవసరం ఉన్న వ్యక్తులే టార్గెట్‌గా ఈ దందా సాగిస్తున్నారు. గతంలో తమ వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు పెట్టుకుని వడ్డీ దందా చేసేవారు. కానీ రానురాను ఆ దందా కొత్త రూపం దాల్చింది.
ఎవరైనా అవసరాలకు నగదు తీసుకున్న తర్వాత సదరు వడ్డీ వ్యాపారులు చట్టబద్ధం కాని వడ్డీ వసూలు చేస్తారు. కానీ ఆయా వసూళ్లు మాత్రం కనబడవు. తీసుకున్న నగదు మొత్తంతో పాటు వడ్డీ చెల్లించినా వారికి ఆ నగదు సరిపోదు. వారం పది రోజులు లేటయిందా ఇక అంతే.. మళ్లీ వడ్డీ నగదు, అసలు నగదుకు సమానమవుతోంది. నగదు తీసుకునే సమయంలో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకుని దగ్గర పెట్టుకునే సదరు వ్యాపారులు, వడ్డీకి నగదు తీసుకునే వారి పేరుమీద ఉన్న ఆస్తులను కూడా తమ పేరుమీద మార్చుకునే హక్కును పొందుతున్నారు. కొద్దీ గొప్ప వడ్డీ చెల్లించాల్సి ఉన్న సమయంలో దానికి రెండింతలు చెల్లించాలని లేదంటే అంతకంటే ఎక్కువ విలువచేసే తమ ఆస్తులను వారిపేరుమీద మార్చుకుంటామని బెదిరింపులకు పాల్పడటం జిల్లాలో పరిపాటిగా మారినట్టు తెలుస్తోంది. అంతేనా ప్రస్తుతం భూముల విలువలు పెరిగిన క్రమంలో కొందరు అక్రమ వ్యాపారం చేసే వడ్డీ వ్యాపారులు ఆయా సేల్‌ డీడ్‌లను ఇతరుల దగ్గర, బ్యాంకుల్లో పెట్టి అసలు యజమానికి ఇచ్చిన నగదుకంటే నాలుగింతల నగదు తీసుకుంటున్నారు. తీరా అసలు యజమానులు తమ పత్రాలు ఇవ్వాలని అడిగితే వారు వేరేచోట తీసుకున్న నగదు మొత్తం చెల్లిస్తేనే ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఈ దందా చాపకింద నీరులా పాకుతూ సాధారణ, మధ్యతరగతి ప్రజల జీవితాలను రోడ్డుకీడుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆస్తులు గుప్పిట్లో పెట్టుకుని తమ జీవితాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment