విద్యుత్ షాక్ తో వ
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేట్ గ్రామానికి చెందిన పిట్టల రాజమొగిలి వయస్సు:37సం, విద్యుత్ షాక్ తో మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది స్థానిక ఎస్సై ఉమాసాగర్ తెలిపిన వివరాలలో మృతుడు రాజమౌళి ఆటో నడుపుకుంటు జీవిస్తాడని మృతుడి నానమ్మ గత 3 రోజుల క్రితం చనిపోవడం తో ఆదివారం 3 వ రోజు కార్యక్రమం కోసం కిషన్ రావు పేట గ్రామ శివారుకు వెళ్ళినారు ..అక్కడ కార్యక్రమ అనంతరం వ్యవసాయ కరెంటు మోటారు వద్ద స్నానం చేస్తుండగా, మృతుడి కొడుకు అయిన రిశ్వంత్ (13) కు కరెంట్ పైపు నుండి ఒకసారి గా కరెంట్ షాక్ రాగా అది చూసిన మృతుడు రాజమౌళి వెళ్లి తన కొడుకుని పక్కకు జరపగా అతని కూడా షాక్ వచ్చినది.. ఇది గమనించిన గ్రామస్తుడు అయిన పిట్టల వీరేశం వెంటనే వెళ్లి ఫీజులు తీసివేసినాడు, రాజమౌళికి విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అంతా కలిసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికి చనిపోయాడని తెలిపినారు.మృతుని భార్య పిట్టల సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవ పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు