అక్రమంగా హైవే పై డివైడర్ తొలగించిన కంకర వ్యాపారులు
తరచూ యాక్సిడెంట్లు అవుతున్న పట్టించుకోని అధికారులు
ఇప్పటికీ వందల కొద్దీ ప్రమాదాలు జరిగిన వైనం. .
సూర్యాపేట జిల్లా డిసెంబర్ 13 ( తెలంగాణ కెరటం) సూర్యాపేట నుండి కోదాడ వెళ్లు హైవే దురాజ్ పల్లి దాటిన తరువాత స్వామి నారాయణ వెంచర్ వద్ద గల కలువ ప్రక్కన డివైడర్ ను అక్రమంగా తొలగించారు అక్కడ ఈ రోజు 9 గంటలకు బండి నీ ఢీకొట్టి కారు వేగంగా ఆపకుండా వెళ్ళిపోయాడు అతనికి రెండు కళ్ళకు బలంగా దెబ్బలు తగిలి చాలా రక్తం పోయింది అతనిది కోదాడ వద్ద కొమర బండ నివాసి నరగాని వెంకటేశ్వర్లు గా చెప్పాడు . అక్కడి నుండి టిప్పర్లు కంకర తీసుకెళ్ళుటకు డివైడర్ తొలగించగా ఆటో వాళ్ళు పాదచారులు బండ్ల వాళ్ళు అటు ఇటూ దాటుతుండగా తరచూ యాక్సిడెంట్లు అవుతున్న పట్టించుకోని అధికారులు స్పందించి వెంటనే హైవే పై గల డివైడర్ నీ మరమ్మతులు చెయ్యాలని కోరుకుంటున్నారు డివైడర్ ను తొలగించిన వారిని చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు .